MLC Elections : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలోని రికాబ్ బజార్ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బీజేపీకి చెందిన నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వాహనం ముందు బీజేపీ క్యాడర్ బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలింగ్ బూత్ ముందు ఏర్పాటు చేసుకున్న బీజేపీ, యూటీఎఫ్, పీఆర్‌టీయూకు సంబంధించిన డెస్కుల వద్ద ప్లెక్సీ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఉదయం…
ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
శాంతిభద్రతల నేపథ్యంలో బెజవాడలో హై అలెర్ట్ విధించారు పోలీసులు. సీపీఎస్ రద్దుని కోరుతూ ఛలో సీఎంఓకు యూటీఎఫ్ పిలుపివ్వడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. విజయవాడకు వచ్చే అన్ని ప్రధాన రహదారుల్లో భారీగా మొహరించారు పోలీసులు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు విధులలో వున్నారు. సర్వీస్ నుంచి నేషనల్ హైవే మీదకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్.. ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేశారు. పొట్టిపాడు, దావులూరు, కాజా చెక్ పోస్టుల వద్ద…
ఏపీలో పీఆర్సీ విషయంలో కొన్ని సంఘాలు సంతృప్తిగా వున్నా యూటీఎఫ్ లాంటి సంఘాలు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఈ పీఆర్సీతో సంతృప్తి చెందలేదన్నారు. సమావేశ హాజరు పట్టీ సంతకాలను ఒప్పందంపై సంతకాలుగా చూపిస్తున్నారన్నారు. ముగిసిపోయిన అధ్యాయం అని మంత్రులు అన్నారు సీఎం అభిప్రాయం మేం ప్రకటించాం.. సీఎం కు చెప్పేదేం లేదన్నారు.అహంకారం గా మాట్లాడే తీరు మార్చుకోవాలన్నారు. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా…
ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయ యూటీఎఫ్ రాష్ట్ర అధక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని, ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించామని, ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని ఆయన మండిపడ్డారు. కనీసం 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, మార్పులు చేయకపోతే పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని ఆయన కోరారు. ఫిట్మెంట్ విషయంలో…