Botsa Satyanarayana: టీచర్ల సంఘాలతో ముగిసిన మంత్రి బొత్స భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఫేస్ యాప్ రికగ్నిషన్ యాప్ తో ఏర్పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణతో టీచర్ల సంఘాల చర్చలు ముగిశాయి. ఫేస్ రిక్నగేషన్ యాప్ తమ ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకునేందుకు టీచర్ల నుంచి అంగీకారం లభించింది. యాప్ లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మంత్రి దృష్టికి పలు అంశాలు తీసుకువచ్చారు. మా ఫోన్లల్లోనే యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అంగీకరించాం అన్నారు.
Read Also: Nikhil: నిఖిల్ కు గట్స్ లేవు.. సినిమా రిలీజ్ తో అతడికేంటి పని.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
Also Read
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రికి వివరించాం అన్నారు. ఫేస్ యాప్ అటెండెన్సులో ఉన్న టెక్నికల్ ఎర్రర్స్ పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరాం. సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేక 248 ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నారు. అలాగే 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయనున్నారు. ఫేస్ రిక్నగేషన్ యాప్ మా ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారని సాయి శ్రీనివాస్ అన్నారు.
టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్లోడింగులో ప్రాబ్లం ఉంటే.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఫేస్ రిక్నగేషన్ అటెండెన్సుకు జీతాలతో లింకు పెట్టమని మంత్రి బొత్స హామీనిచ్చారు. ఎంఈఓ పోస్టులను ఎఫ్ఏసీలుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనపై ఆలోచన చేస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రితో జరిగిన సమావేశంలో ఫేస్ రిక్నగిషన్ యాప్ అటెండెన్సుపై చర్చ జరిగింది. అలాగే, టీచర్ల బదిలీలు, క్రమబద్దీకరణపైన చర్చించారు.
ఫేస్ యాప్ వల్ల వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందని, ఎవరి మొబైల్లో వారు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే సమస్యలు వస్తాయని టీచర్ల సంఘం మంత్రికి తెలిపింది. ప్రభుత్వమే గతంలో మాదిరిగా డివైజులు ఇవ్వాలని సూచించారు. లేదంటే యాప్ కాకుండా స్కూళ్లలోనే ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Also: Nirmala Sitharaman: తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబు కూడా అప్పు కట్టాల్సిన పరిస్థితి
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపామని, విద్యా, వైద్యం ప్రభుత్వ ప్రాధాన్యతలన్నారు మంత్రి బొత్స. ఈ రెండు రంగాలను పటిష్టం చేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటుంటాం.ఉమ్మడి సర్వీస్ రూల్సుకు సంబంధించిన అంశం పెండింగులో ఉంది.672 మంది ఎంఈఓ పోస్టులకు గానూ.. 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.మండల స్థాయిలో పటిష్ట పర్యవేక్షణ కోసం ఎంఈఓలు పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయడానికి నిర్ణయం.ఖాళీగా ఉన్న 248 ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ టీచర్లను ఇన్ఛార్జీలుగా నియమిస్తాం అన్నారు మంత్రి.
ఫేస్ రికగ్నేషన్ అటెండెన్సు విషయంలో టీచర్ల అనుమానలను నివృత్తి చేశాం.సాంకేతిక సమస్యలను పరిశీలించేందుకు 15 రోజులు సమయం కావాలని టీచర్లు అడిగితే.. అంగీకరించాం.ఫేస్ రికగ్నేషన్ అటెండెన్సుని ఏ ఒక్కరి కోసమో తెచ్చింది కాదు.సీపీఎస్ రద్దు ఆందోళన కేసులు విషయమై సీపీఎస్ ఉద్యోగులు చర్చిస్తాం.యాప్ అటెండెన్సు తెచ్చినా.. నిబంధనల్లో మార్పులు లేవన్నారు మంత్రి బొత్స
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు