Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia need 174 more to win Ashes 2023 1st Test: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి టెస్ట్ గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇంగ్లండ్‌కు సమ అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టుకు ఇంకా 7 వికెట్స్ కావాలి. దాంతో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. చివరి రోజు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే వారికే తొలి టెస్ట్ సొంతమవుతుంది. అయితే ముగ్గురు స్టార్ బ్యాటర్లు పెవిలియన్ చేరినా.. క్రీజులో ఉస్మాన్ ఖవాజ ఉండడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం.
ఇంగ్లండ్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మంచి శుభారంభమే దక్కింది. ఫామ్ లేమితో సతమతమవుతున్న సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (36) ఫర్వాలేదనపించాడు. అయితే వార్నర్‌ను ఓలి రాబిన్సన్ ఔట్ చేయడంతో 61 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) నిరాశపరిచాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
Also Read
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
- BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
- ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
- Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Also Read: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం గోల్డ్ ఎంతంటే
కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటాడనుకున్న మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (6) త్వరగానే ఔట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజ (34 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా
స్కాట్ బోలాండ్ (13) ఉన్నాడు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి 174 పరుగుల దూరంలో ఉంది. ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ బ్యాటింగ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో విజయావకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి. ఇంగ్లీష్ బౌలర్లు మాయ చేస్తే గాని ఆసీస్ ఓడిపోక తప్పదు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 393/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆపై ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో గట్టి పోటీ ఇచ్చింది. ఉస్మాన్ ఖవాజా (141) సెంచరీ చేయడంతో 386 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 273 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఆసీస్ 281 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఐదవ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..