Ashes 1st Test: ఇదేం ఫీల్డింగ్ రా బాబు.. ఇలాంటిది నేనెక్కడ చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా ఒక్కసారిగా బయటకు తీశాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన బెన్ స్టోక్స్.. ఫీల్డింగ్ సెట్టింగ్ విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి మరీ ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. తొలుత స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్‌లు, రెండు లెగ్ స్లిప్‌లు పెట్టిన స్టోక్స్.. ఆట మూడో రోజు (జూన్ 18) ఉస్మాన్ ఖ్వాజాపై ఒత్తిడి పెట్టేందుకు క్వార్టర్ సర్కిల్‌లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలాంటి వెరైటీ ఫీల్డ్ సెటింగ్ ద్వారా.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా బెన్ స్టోక్స్ చేశాడు.
Read Also: Devendra Fadnavis: జాతీయవాద ముస్లింలు ఎవరూ ఔరంగజేబును తమ నాయకుడిగా గుర్తించరు..
Also Read
కాగా, 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి కేవలం 386 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (141) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను దాదాపుగా చేరుకునేంతా పని చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్ హెడ్ (50), కామారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (34) పోరాడటంతో ఇంగ్లండ్‌కు జస్ట్ 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రమే దక్కింది.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!