Boy Shoots Teacher: అగ్రరాజ్యమైన అమెరికాలో గన్‌కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో శుక్రవారం ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో విద్యార్థులెవరూ గాయపడలేదు. ఆరేళ్ల విద్యార్థి పోలీసుల కస్టడీలో ఉన్నట్లు పోలీస్ చీఫ్ స్టీవ్ డ్రూ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన కాల్పులు కాదని ఆయన అన్నారు. కావాలనే విద్యార్థి టీచర్‌పై కాల్పులకు తెగబడినట్లు తెలిపారు.
Atrocity in temple: ఆలయంలో ఘోరం.. మహిళ జుట్టు పట్టి ఈడ్చి బయటపడేశారు
బాధితురాలి వయస్సు 30 ఏళ్లలోపు ఉపాధ్యాయురాలని, ఆమె గాయాలు ప్రాణాపాయమని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల గురించి తెలిసిన వెంటనే తాను షాక్‌కు గురయ్యానని నగరంలోని పాఠశాలల సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్ అన్నారు. పిల్లలకు తుపాకులు అందుబాటులో లేకుండా చూసుకోవడానికి తమకు మద్దతు అవసరమని ఆయన అన్నారు. పాఠశాలల్లో కాల్పులు యునైటెడ్ స్టేట్స్‌ను పీడిస్తున్నాయి, గత మేలో టెక్సాస్‌లోని ఉవాల్డేలో 18 ఏళ్ల ముష్కరుడు 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపడం సహా ఇటీవల పలు విషాదాలు చోటుచేసుకున్నాయి. గన్ వయొలెన్స్ ఆర్కైవ్ డేటాబేస్ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో గత సంవత్సరం 44,000 తుపాకీ సంబంధిత మరణాలు నమోదయ్యాయి.