పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది.
టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.
ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశాల కోసం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన బృందం నేటి నుంచి ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో 80వ ఐరాస కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తన భర్తను కాల్చి చంపిన వ్యక్తిని తాను క్షమించేశానని చార్లీ కిర్క్ భార్య ఎరికా ప్రకటించారు. దీంతో సంతాప కార్యక్రమానికి హాజరైన వారంతా స్టాండింగ్ ఒవేషన్ చేశారు. ఎరికా ప్రకటనను అందరూ స్వాగతించారు. చార్లీ కిర్క్‌ను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారం అరిజోనాలోని గ్లెండేల్లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది.
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును తప్పుపట్టాయి. అయితే ఈ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని ట్రంప్ ప్రకటించారు. తనకు తెలియకుండానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని చెప్పుకొచ్చారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్‌పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.
ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే కలవబోతున్నారు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ, ట్రంప్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు.