గత శనివారం అగ్ర రాజ్యం అమెరికా అతి పెద్ద సైనిక ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకొచ్చేశారు. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఇంత పెద్ద సైనిక ఆపరేషన్ చేపడితే.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అసలు ఆ ఆపరేషన్ గురించే ఆమెకు సమాచారం తెలియదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను పక్కన పెట్టారా? ఉద్దేశపూర్వకంగా తప్పించారా? అన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వైట్‌హౌస్ విడుదల చేసిన ఫొటోలే ఇందుకు ఉదాహరణంగా నిలుస్తున్నాయి.

తులసి గబ్బార్డ్.. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్. అంతేకాదు అధ్యక్షుడి ప్రధాని నిఘా సలహాదారుగా ఉన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సహా దేశంలోని 18 నిఘా సంస్థలను పర్యవేక్షిస్తున్నారు. ఇంత పెద్ద క్యాడర్‌లో ఉన్న ఆమెకు వెనిజులా ఆపరేషన్ గురించే తెలియదంట. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా?.. కానీ ఇది వాస్తవం.
గత వేసవి కాలం నుంచే వెనిజులా ఆపరేషన్ గురించి ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ఆ ఆపరేషన్ గురించి తులసి గబ్బార్డ్‌కు ఒక్క విషయం కూడా తెలియదని సమాచారం. వెనిజులా ఆపరేషన్ తర్వాత వైట్‌హౌస్ నుంచి విడుదలైన ఫొటోల్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాప్ స్టీఫెన్ మిల్లర్, సీనియర్ సహాయకులు తాత్కాలిక యుద్ధ గదిలో కనిపించారు. కానీ తులసి గబ్బార్డ్ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే తులసి గబ్బార్డ్ గురించి ‘DNI’ అని రాసి ఉన్నట్లు తెలుస్తోంది. అంటే దాని అర్థం ‘‘ఆహ్వానించవద్దు’’ అని నివేదికను బట్టి సమాచారం. అంటే వెనిజులా ఆపరేషన్ గురించి ఆమెకు తెలియకూడదనే ట్రంప్ ఆమెను పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Mexico: ట్రంప్ మరో దూకుడు.. మెక్సికోపై దాడి చేయబోతున్నట్లు ప్రకటన
అయితే 2019లో తులసి గబ్బార్డ్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెనిజులాకు దూరంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా గత నెలలోనే యుద్ధ ప్రియులు దేశాన్ని విదేశీ సంఘర్షణలు వైపు నెట్టేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రకనటలు కారణంగానే మదురోను పట్టుకునేందుకు నిర్వహించే ఆపరేషన్‌కు ఆమె మద్దతు ఇవ్వదన్న కారణంతోనే ఆమెను పక్కనపెట్టినట్లు సమాచారం.
అయితే ఆ వార్తలను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖండించారు. వెనిజులా ఆపరేషన్ ప్రణాళిక నుంచి తులసి పక్కన పెట్టారా? అన్న వాదనను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని.. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. అందరం ఒకే బృందంలో భాగమని స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెయుంగ్ బ్లూమ్‌బెర్గ్ మాట్లాడుతూ.. తులసి గబ్బార్డ్‌పై ట్రంప్‌కు పూర్తి నమ్మకం ఉందని.. ఆమె అద్భుతంగా పని చేస్తోందని కితాబు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Greenland: ట్రంప్‌కు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం చేసుకుంటే..!
ఇక తులసి గబ్బార్డ్ తన హవాయి సెలవుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను బట్టి ఆమెకు వెనిజులా ఆపరేషన్ గురించి అసలేం తెలియదని అర్థమవుతోంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ట్రంప్ అంతర్గత సమావేశాలకు తులసిని దూరంగా ఉంచినట్లు అర్థమవుతోంది.