సుంకాలపై ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి.
న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమతి శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. ఇక అరబ్-ఇస్లామిక్ సమ్మిట్‌లో ట్రంప్ పాల్గొన్నారు.
అమెరికాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు మాక్రాన్ వెళ్లారు. అయితే అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ కూడా వస్తోంది. దేశ అధ్యక్షుడు కాబట్టి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రోడ్డుపై మాక్రాన్‌ను నిలిపివేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియాకు ఐక్యరాజ్యసమితిలో షాకింగ్ పరిణామం ఎదురైంది. యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే జరిగిందో తెలియదు గానీ.. యూఎన్ కార్యాలయంలో ట్రంప్, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే హఠాత్తుగా ఆగిపోయింది
అమెరికాలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహంపై రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహం ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.