పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ప్రధాని మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ గొప్ప వ్యక్తి అని.. అలాగే మంచి స్నేహితుడు అంటూ కొనియాడారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆ వీడియోను ఇప్పటి వరకు చూడలేదని.. ఎప్పటికీ చూడను.. చూడబోనని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ తెలిపింది. ట్రంప్ సన్నిహితుడు, టర్నింగ్ పాయింట్ యూఎస్ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించారు.
అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులన్నీ డెమోక్రాటిక్ పార్టీ కైవసం చేసుకుంది.
ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది.
ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.
అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
ప్రియురాలి కోసం అధికారిక జెట్‌ను ఉపయోగించడంపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. షట్‌డౌన్ కారణంగా జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేసేందుకు జెట్‌లో తిరుగుతున్నారంటూ వివాదం జరిగింది.