కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్ కు చెందిన వాళ్లూ.. అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా గుర్తించారు.
అమెరికాల్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Eric Garcetti: భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నెల ప్రారంభంలో గార్సెట్టి నామినేషన్ ను యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
Lust : యువకులు ఆంటీలపై మోజు కలిగి ఉంటారని వింటుంటాం.. కానీ ఒక స్త్రీ తన కొడుకు వయసున్న బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భం దాల్చిన ఘటన షాకింగ్ కు గురిచేస్తుంది.
Maha Shivratri celebrations in US: అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో… పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి. ఫిబ్రవరి 18 ఉదయం 7 గంటలకు మొదలైన సప్త కళాభిషేకం… తెల్లవారుఝాము 4 గంటల వరకు నిర్విఘ్నంగా, అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. పది వేలకు పైగా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చి శివ పారవశ్యంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా సృష్టి స్థితి లయకారుడైన పరమ…
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది.
Organs Donating : అమెరికాలో ప్రస్తుతం ఓ బిల్లు దుమారం రేపుతోంది. మానవత్వం కలిగియున్న ఖైదీల శిక్ష తగ్గించేందుకు అక్కడ ప్రభుత్వం కొత్త బిల్లు ప్రతిపాదించింది.
Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్‌లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది.
India Now World's 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం…