అమెరికాలోని జార్జియాలో స్వలింగ సంపర్కుల జంటకు కోర్టు శిక్ష విధించింది. తమ దత్తపుత్రులను లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేలిన ఓ ‘గే జంట’కు 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇద్దరు ముద్దాయిలు విలియం డేల్ జుల్లాక్, జాచరీ జుల్లాక్‌లకు శిక్ష విధించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. విలియమ్‌కు 34 ఏళ్లు కాగా, జాకరీకి 36 ఏళ్లు. అయితే.. వారు 12, 10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరులను దత్తత తీసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం.. పిల్లలపై అత్యాచారానికి సంబంధించిన కంటెంట్ 2022లో గూగుల్‌లో అప్‌లోడ్ చేశారని వాల్టన్ కౌంటీ పోలీసులకు సమాచారం అందింది.
Read Also: Allu Arjun Bouncer Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందుతుడు అరెస్ట్!
ఈ క్రమంలో.. విచారణ చేపట్టిన పోలీసులు హంటర్ లాలెస్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతను జాచరీ జుల్లాక్ అనే యువకుడు తనకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను పంపాడని చెప్పాడంతో.. అసలు విషయం బయటపడింది. దీంతో.. బాలలపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు నిందితులు జాకరీ జుల్లాక్, విలియం డేల్ జులాక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరూ స్వలింగ సంపర్కులని, జంటగా కలిసి జీవించారని తేలింది. దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.
Read Also: AP Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఆ మూడు జిల్లాలో భారీ వర్షాలు!
ఈ ఘటనలో పోలీసులు మాట్లాడుతూ.. జాచరీ ఒకసారి స్నాప్‌చాట్‌లో పిల్లల వేధింపుల ఫోటోను పంచుకున్నాడని.. అంతేకాకుండా, ‘నేను ఈ రాత్రికి నా కొడుకుతో పడుకోబోతున్నాను తప్పు చేయడానికి’. ఇది కాకుండా.. గే జంట స్థానిక పెడోఫైల్ సెక్స్ రింగ్‌లో దత్తపుత్రులపై అత్యాచారం చేసిన కేసును సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకున్నారని ఓ నివేదిక తెలిపింది.