అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా భారతీయుల హతం అవుతున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో విద్యార్థి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. చికాగో పెట్రోల్ పంప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ నూకారపును కాల్చి చంపారు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ(22) నాలుగు నెలల క్రితమే ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అయితే చికాకూ పెట్రోల్ బంక్‌లో జరిపిన కాల్పుల్లో సాయి తేజ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.
బాధిత కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ నాయకుడు మధుసూదన్ పరామర్శించారు. మృతదేహం భారత్ తీసుకొచ్చేందుకు అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. సాయితేజ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. పార్ట్‌టైమ్‌గా చికాగో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. కాల్పులు జరిపినప్పుడు మాత్రం డ్యూటీలో లేడు. తన స్నేహితుడికి సాయం చేస్తున్నాడు. ఆ సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సహాయం చేయడానికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభ్యులతో కూడా మాట్లాడినట్లు మధుసూదన్ చెప్పారు.
ఇది కూడా చదవండి:OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?