ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికాలో బుధవారం దారుణం జరిగింది. మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అధికారి జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ ప్రాణాలు కోల్పోయింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేస్తుండగా జరిపిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా, క్యూబా, మెక్సికోకు హెచ్చరికలు జారీ చేశారు. కొలంబియా కూడా చాలా అనారోగ్యంతో ఉందని.. పెట్రో కొకైన్ అమ్ముతోందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మార్కెట్ ధరకే వెనిజులా నుంచి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు.
ప్రధాని మోడీతో సంబంధాలపై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు కారణంగా ప్రధాని మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. తాను మాత్రం మోడీతో బాగానే ఉన్నానని పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్‌పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. చమురు, ఎన్నికలు, ఇన్‌ఛార్జ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్-ఎలాన్ మస్క్ మరోసారి కలిసి ప్రత్యక్షమయ్యారు. ఫ్లోరిడాలోని అధ్యక్షుడికి చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక విందుకు ఎలాన్ మస్క్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.