ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ వెనకడుగు వేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు దిగబోతుందున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ హత్యా బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ‘‘అప్పుడు బుల్లెట్ మిస్ అయింది.. ఈసారి గురి తప్పదు’’ అంటూ ఇరాన్ టీవీ బహిరంగంగా ప్రసారం చేసింది. అంటే అమెరికా దాడికి దిగితే.. ప్రతి దాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో రక్తసిక్తం అవుతోంది.
గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు. సెర్గియో గోర్ నుంచి అక్రిడిటేషన్ పత్రాలను ద్రౌపది ముర్ము స్వీకరించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కీలక అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి. చర్చలు ఫలించకపోవడంతో ఇరు దేశాల మధ్య దూరం నడుస్తోంది.
ఇరాన్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.