అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులన్నీ డెమోక్రాటిక్ పార్టీ కైవసం చేసుకుంది.
ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది.
ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.
అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
ప్రియురాలి కోసం అధికారిక జెట్‌ను ఉపయోగించడంపై ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. షట్‌డౌన్ కారణంగా జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. కాష్ పటేల్ మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేసేందుకు జెట్‌లో తిరుగుతున్నారంటూ వివాదం జరిగింది.
భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు.
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది.
అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు.