వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుందని మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు తనకు హామీ ఇచ్చారని.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
రెండు వారాల్లో పుతిన్‌ను కలుస్తానని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌ను కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.
యుద్ధాలను ఆపడం తనకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడారు. ఏ అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధాన్ని ఆపలేదని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను మాత్రం ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా తనకు నోబెల్ బహుమతి వచ్చిందా? అంటే లేదన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.
వెనిజులా తీరంలో మరోసారి అమెరికా దాడి చేసింది. తీరంలో వేగంగా దూసుకెళ్తున్న నౌకపై అమెరికా దళాలు దాడులు చేయడంతో ఆరుగురు నార్కో ఉగ్రవాదులు మరణించారని ట్రంప్ తెలిపారు. గత కొద్దిరోజులుగా వెనిజులా తీరంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న నౌకలపై అమెరికా దాడులు చేస్తోంది.
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది, దివంగత చార్లీ కిర్క్ 32వ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ట్రంప్ అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్‌కు మెడల్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆద్యంతం ఎరికా కిర్క్ దు:ఖపడుతూనే ఉన్నారు. ట్రంప్ దగ్గరకు తీసుకుని ఓదార్చారు.
అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా? అని మెలోనిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది.