అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకిచ్చారు. దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ ట్రంప్ సంతకం చేశారు. పెంచిన సంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.
కొలరాడోలోని బౌల్డర్‌లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా నిందితుడు పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. పాలస్తీనాను విడిపించాలని డిమాండ్ చేశాడు.
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 26 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఎలాన్ మస్క్ శకం ముగియలేదని.. ట్రంప్‌కు సలహాలు ఇస్తూనే ఉంటారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలాన్ మస్క్ తన కాలం ముగియడంతో తప్పుకున్నారు.
కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా మరోసారి చర్చలు జరిపింది. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. కానీ అమెరికా ప్రతిపాదనలను హమాస్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని హమాస్ పేర్కొంది.
Vivek Ramaswamy: భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్‌లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి…
భారతీయులు ఎక్కడున్నా సందడిగానే ఉంటారు. ఇక ఏ వేడుక చేసినా గ్రాండ్‌గానే చేస్తారు. చిన్న కార్యక్రమం అయినా... పెద్ద కార్యక్రమం అయినా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఏ దేశంలో ఉన్నా ఒకటే పద్ధతి ఉంటుంది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హార్వర్డ్ యూనివర్సిటీపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విదేశీయులను చేర్చుకునే సర్టిఫికేషన్ కూడా ట్రంప్ పరిపాలన రద్దు చేసింది. దీంతో విదేశీ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.