అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం తేదీ ఫిక్స్ అయింది. ఈనెల 15న అలాస్కాలో పుతిన్‌ను కలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం సమావేశం అవుతున్నట్లు మాస్కో డిప్యూటీ ఐక్యరాజ్యసమితి రాయబారి డిమిత్రి పాలియాన్స్కీ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. కొత్త టారిఫ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా వస్త్రాలు, ఆటో రంగం, సముద్ర ఫుడ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం ప్రత్యక్షంగా కలవబోతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో విమాన సేవలు నిలిచిపోయాయి. టెక్నాలజీ సమస్య కారణంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షణతో విసుగు చెందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య తీవ్ర వివాదాస్పదమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోనార్క్‌లా ప్రవర్తిస్తు్న్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ దూరం అయ్యారు. అదే కోవలో పలువురు ఉన్నారు.
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.