ఒసామా బిన్ లాడెన్.. అగ్ర రాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు మరిచిపోలేని పేరు. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిగించిన మారణహోమంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి అయిన లాడెన్ కోసం అమెరికా దళాలు అవిశ్రాంతిగా పోరాటం చేశాయి.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పని అంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
మలేషియాలో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ వెళ్లకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఆ సదస్సుకు ట్రంప్ రావడంతోనే మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తప్పించుకునేందుకే ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
దీపావళి వేడుకల్లో ప్రధాని మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విమర్శలు గుప్పించారు. క్వీన్స్‌లోని హిందూ దేవాయాలను సందర్శించిన తర్వాత భారతీయులను ఉద్దేశించి మమ్దానీ ప్రసంగించారు. భారతదేశంలో కొన్ని రకాల భారతీయులకు మాత్రం స్థలం ఉందని.. అదే దార్శనికతతో భారతదేశాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైట్‌హౌస్‌లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
భారత్‌ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
త్వరలో రష్యా చమురు కొనుగోలు భారత్ నిలిపివేస్తుందని మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే ప్రధాని మోడీతో మాట్లాడినప్పుడు తనకు హామీ ఇచ్చారని.. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
రెండు వారాల్లో పుతిన్‌ను కలుస్తానని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రెండు వారాల్లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో పుతిన్‌ను కలవాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు.
యుద్ధాలను ఆపడం తనకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడారు. ఏ అధ్యక్షుడు కూడా ఒక్క యుద్ధాన్ని ఆపలేదని అనుకుంటున్నట్లు తెలిపారు. తాను మాత్రం ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా తనకు నోబెల్ బహుమతి వచ్చిందా? అంటే లేదన్నారు.