ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయిస్తున్నారు. తొలుత వాణిజ్య యుద్ధంతో మొదలు పెట్టగా.. ఇప్పుడు వీసాల పేరిట వార్ మొదలు పెట్టారు. H-1B వీసాలపై ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయానికి తూట్లు పొడిచారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. H-1B లాటరీ విధాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో కొత్త పథకంతో భర్తీ చేస్తోంది. నైపుణ్యం కలిగిన కార్మికులు, అధిక వేతనం పొందే విదేశీ కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. తాజా నిర్ణయంతో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి.
ఇది కూడా చదవండి: Exam Paper: ఎగ్జామ్ పేపర్‌లో ‘ముస్లింలపై దారుణాలు’’ అనే ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం.. ఈ కొత్త నియమం ఫిబ్రవరి 27, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం క్యాప్ రిజిస్ట్రేషన్‌కు వర్తించనుంది. అంటే ఆ సంవత్సరం ప్రారంభమయ్యే ఉద్యోగాల కోసం మార్చి, 2026లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సమాచారం. అయితే సాధారణ కోటా కింద ప్రతి ఏడాది ఇచ్చే 85,000 సంఖ్యను 65,000కి పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Epstein Files: మరో ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల.. ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు!
యజమాని సూచించిన విధంగా అధిక జీతాలు ఉన్నవారికి మాత్రమే ఈ వీసాలు వర్తించనున్నాయి. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త రూల్స్ ప్రకారం భారతీయులకు ఎక్కువ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.