అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు తుపాకీతో చెలరేగిపోయాడు. కేథలిక్ పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8, 10 వయసు గల ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచం వ్యాప్తంగా ఆరు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చెబుతుంటారు. ఇదే క్రమంలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపానంటూ ట్రంప్ ఎక్కడికెళ్లినా చెబుతున్నారు.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నేటి నుంచి భారత్‌పై 50 శాతం సుంకాలు అమలవుతున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమించారు. తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్(38)ను భారత రాయబారిగా నియమించినట్లు సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. న్యూయార్క్ హైవేపై భారతీయులతో ప్రయాణిస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం చేసేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సాధ్యపడలేదు. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు.
భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారతీయ సంప్రదాయాన్ని అలవాటు చేసుకుంటున్నారు. సోమవారం అమెరికాలో మెలోని పర్యటించారు. జెలెన్స్కీకి మద్దతుగా యూరోపియన్ నేతలంతా తరలివచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం సాగింది.