అమెరికా వెళ్లాలనుకునే వారికి షాక్. భారత్‌లో 2,000 వీసా అపాయింట్ మెంట్స్‌ను అమెరికా రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాల కారణంగా 2 వేలకుపైగా వీసా దరఖాస్తులను రద్దు చేసినట్లు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. గత సంవత్సరం యూఎస్ రాయబార కార్యాలయం అంతర్గత దర్యాప్తు నిర్వహించి దరఖాస్తుదారులకు వీసాలు పొందడానికి నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా US ప్రభుత్వాన్ని “మోసం” చేసిన 30 మంది ఏజెంట్ల జాబితాను రూపొందించింది. అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ వ్యవస్థలో…