Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే జనరిక్ ఔషధాలపై సుంకాలను మినహాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందులపై పన్నులు విధించాలా? వద్దా? అనే దానిపై నెలల తరబడి చర్చ జరిగిన తర్వాత జనరిక్ ఔషధాలపై సుంకాలను విధించే ప్రణాళికల్ని విరమించుకన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
Tariff On India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని చెబుతూ అమెరికా 25 శాతం పరస్పర సుంకాలతో పాటు మరో 25 శాతం శిక్షార్హమైన సుంకాలను విధించింది. మొత్తంగా ట్రంప్ సర్కార్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించింది. అయితే, ఇప్పుడు అమెరికాకు తత్వం బోధపడింది. తాము, సుంకాలతో భారత్‌పై చర్యలు తీసుకున్నా కొద్దీ, రష్యా, చైనాలకు దగ్గర అవుతుందనే భయం అమెరికా పరిపాలనను వెంటాడుతోంది. దీంతో, ఎలాగొలా భారత్‌తో…
USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిత్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Trump Tariffs India: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం.. ఇవాళ (ఆగస్టు 27న) తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి కొత్త టారీఫ్స్ అమల్లోకి రానున్నాయి. గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి ఇండియన్ ఎగుమతులపై మొత్తం 50 శాతం భారం పడనుంది.…
గత వారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బ్రెజిల్ సహా అనేక దేశాలపై 50 శాతం సుంకం విధించాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో బంగారం దిగుమతులపై సస్పెన్స్ నెలకొంది. అదే సమయంలో, బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో బంగారంపై ఎటువంటి సుంకం ఉండదని ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. Also Read:Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది.
Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్…
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశ రత్నాల, ఆభరణాల రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనుందని సదరు రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ విదేశీ మారకద్రవ్య ఆదాయానికి ప్రధానంగా దోహదపడే ఈ రంగం ఇప్పటికే వివిధ ఆర్థిక ఒత్తిళ్లతో కొట్టుమిట్టాడుతోంది. మళ్లీ ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్ దెబ్బకు ఈ రంగం మరికొన్ని సవాళ్ళను ఎదురుకొనేలా కనపడుతోంది. ట్రంప్ భారత్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, డీఐఐటీ ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, సుంకాల ప్రభావాలను పిఎంఓకు వివరించారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ట్రంప్ సుంకాలపై ఉన్నతస్థాయిలో అంచనాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. Read Also: Amazon…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా, కెనడా, మెక్సికోలతో భారత్ ను పోల్చమని యూఎస్ తెలిపింది. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూఎస్‌కు చెందిన వాణిజ్య శాఖ అధికారులు, ఢిల్లీలోని అధికారులతో చర్చల సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.