ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేక దంపతులిద్దరూ కారులోనే సజీవ దహనమయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పోలీసులు ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. మద్యం మత్తులో ఓ యువకుడు 30 అడుగుల లోతులో ఉన్న మురికి కాలువలో పడగా.. పోలీసులు అతడిని బయటకు తీశారు. అతడిని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Shocking: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి కసాయిలా ప్రవర్తించాడు. తనకు పుట్టబోయే బిడ్డ మగ పిల్లాడా, ఆడ పిల్ల అని లింగ నిర్ధారణ చేసేందుకు గర్భిణి అయిన భార్య కడుపును చీల్చాడు.
ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో జనరేటర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 4 ఫ్లాట్లు దగ్ధమయ్యాయి.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్‌ను తాకబోతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి కుక్కను తోసి చంపాడు. అప్పటి నుంచి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బీజేపీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలంతా ఆయనను స్మరించుకుని నివాళులు అర్పిస్తున్నారు.