HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..
- నిత్య పెళ్లికూతురి అరెస్ట్..
- వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్..
- వరుల కోసం అధికారుల ఉరుకులు పరుగులు..
- మొత్తం 5 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV-positive: ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు, ఇతర అధికారులకు కొత్త కష్టం వచ్చిపడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ ‘‘నిత్య పెళ్లికూతురి’’ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిళ్ల గురించి అధికారులు పెద్దగా వర్రీ అవ్వడం లేదు, కానీ ఆమెకు పరీక్షల్లో ‘‘హెచ్ఐవీ’’ పాజిటివ్ అని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
జైలుకు తరలించే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో మహిళకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఈమె వలలో ఎంత మంది పురుషులు ఉన్నారు..? ఎంత మందితో శారీరక సంబంధం పెట్టుకుంది..? అనే వివరాల కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వివాహాల ద్వారా అనేక మంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకుని నగదు, నగలతో పరారయ్యేది. ఈమెను పెళ్లి చేసుకున్న వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మే 6న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అంతటా ఇలా నకిలీ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న గ్యాంగ్‌లో నిందితురాలు సభ్యురాలిగా తేలింది. ఇందులో మొత్తం ఆరుగులు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందర్ని ముజఫర్‌నగర్ జైలులో ఖైదు చేశారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
జిల్లా ఆస్పత్రి వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీగా తేలింది. ఈమెతో శారీరక సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరాఖండ్‌లో గుర్తించారు. వీరందరికి కూడా హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. వ్యాధి సోకిన కుటుంబీకులను కూడా అధికారులు పరీక్షిస్తున్నారు. యూపీ లోని ముజఫర్‌నగర్ ఇతర ప్రాంతాల్లో ఈమె బారినపడిన వరుల కోసం అధికారులు వెతుకుతున్నారు. నిందితురాలు ఉత్తరాఖండ్ లోని యుఎస్ నగర్ జిల్లాలకు చెందిన వారిగా తేలింది. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళ బంధువులుగా నటిస్తూ పెళ్లిళ్లు జరిపించేవారు. ఉత్తరాఖండ్‌లో మూడింటితో పాటు మొత్తం ఐదు వివాహాలు చేసుకున్నట్లు మహిళ విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఈమెకు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) చికిత్సని ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!