మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి.
రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి.
బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు.
యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.
Yogi Adityanath: నేరగాళ్లు, మాఫియా అణిచివేతను కొనసాగిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞ చేశారు. అణిచివేత చర్యలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.
గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలు బి-9 కోచ్‌లో అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ఆర్మీ వ్యక్తి మహిళా ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఆ మహిళ ఆర్మీ సిబ్బందిపై ఫిర్యాదు చేసినా గ్వాలియర్, ఝాన్సీలలో ఆమెకు సహాయం అందలేదు.
Mars: అంగారకుడిపై రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని రెండు పట్టణాల పేర్లను పెట్టారు. ఈ గ్రహంపై గతంలో ఎప్పుడూ తెలియని మూడు బిలాలను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఓ వైపు తీవ్రమైన ఎండ.. ఇంకోవైపు నీటి కొరత.. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది.
యూపీ రాజధాని లక్నోలోని దేవా రోడ్లో ఉన్న ఓయో రెడ్ బిల్డింగ్ గెస్ట్ హౌస్‌లోని రూమ్ నంబర్ 105లో 22 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. అమ్మాయి బారాబంకి నివాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.