Barber: తినే ఆహరంలో, కూల్‌డ్రింక్స్‌లో కొందరు పైశాచిక ఆనందం కోసం ఉమ్మేయడం చూశాం. ఇప్పుడు ఓ బార్బర్ తన కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తున్న సమయంలో ఉమ్మిని ఉపయోగించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ కనౌజ్‌కి చెందిన ఓ సెలూన్‌లో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్మిని రాసిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.