AIMIM MP Asaduddin Owaisi meet Minister KTR Today At Assembly. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే ఇటీవలే 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. యూపీలో 100 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్‌ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజుల క్రితం కేటీఆర్ అపాయింట్ మెంట్ అసదుద్దీన్ కోరడంతో.. ఇవాళ అసెంబ్లీకి…
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…
BJP Lead In 5 Assembly Elections 2022. Congress Lost Punjab Also. Sad News for Congress High Command. ఈ ఎన్నికలతోనైనా తమ సత్తా చాటుదామనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలైనట్లే కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులపై…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. నేడు రెండవ విడతలో 55 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈవిడతలో అధికార బీజేపీకి సానుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. గట్టిపోటీని ఎదుర్కుంటున్నారు అధికార బీజేపీ అభ్యర్ధులు. షాజహాన్ పూర్, రాంపూర్ స్థానాలపైనే అందరి దృష్టి వుంది. 1989 నుంచి షాజహాన్ పూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్.ఎల్.ఏ గా ఎన్నికై, 9 వ సారి కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సీనియర్…
యూపీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నేతల ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. యూపీ సీఎం యోగి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గోరఖ్‌పుర్ శాసనసభస్థానం నుంచి యోగి తన నామినేషన్ దాఖలుచేశారు. ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు.…
యూపీ ఎన్నికల్లో ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమయిన యూపీ ఎన్నికలు దేశానికి మార్గనిర్దేశనం చేస్తాయనడంతో అతిశయోక్తి లేదు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎన్నికల ముందు ఆయాపార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజంఖాన్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన జైలులో వున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను జైలు నుంచే దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన సీతాపూర్ జైల్లో…
యూపీలో బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్న వేళ రొటీన్ కి భిన్నంగా జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ త్వరలో బీజేపీ జెండా పట్టుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అర్పనా సింగ్ పోటీ చేశారు. ఆమె బీజేపీ అభ్యర్థి రీటా…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ‘ఉచిత’ హామీల పర్వం కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలోనే తాజాగా సమాజ్‌వాదీ పార్టీ సైతం గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీతో ముందుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితమని ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. Read Also:ప్రధాన మంత్రి…
యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ముందస్తుగానే నేతలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల హామీలను ఇస్తున్నారు. యూపీలో ఇప్పటికే అన్ని పార్టీలకన్నా ముందుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తెరలేపింది. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కాగా తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో రూ. 5లక్షల కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేస్తామని…
యూపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహిస్తుంది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. తాజాగా యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా,2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో 300లకు పైగా…