BJP Lead In 5 Assembly Elections 2022. Congress Lost Punjab Also. Sad News for Congress High Command.
ఈ ఎన్నికలతోనైనా తమ సత్తా చాటుదామనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు అడియాశలైనట్లే కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల నుంచి బీజేపీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వస్తే అదిచేస్తాం.. ఇది చేస్తామని ప్రజలకు హామీల వర్షం కురిపిస్తూ ముందుకు వెళ్లారు. అంతేకాకుండా 5 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ఎండనక వానననక ఎంతో కష్టపడి ప్రజలను మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ.. ఎన్నికల జరిగి వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే.. కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అంతేందుకు పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా పట్టుకోల్పోయింది.
పంజాబ్‌లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. అయితే గోవా మినహా మిగితా 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది. అయితే గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు 21 మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో.. అక్కడ ప్రస్తుతం 18 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 10స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా తృణమూల్‌తో పాటు ఇతరులు మిగితా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైనట్లు.. పంజాబ్‌లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో లేకపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి నిరాశపరిచే విషయమే.