గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం వ్యవసాయ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా మూడు నూతన చట్టాలను ఆమోదించింది. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు వీటిని వ్యతిరేకించాయి. మొదట పంజాబ్, హర్యానా రైతులు ఆందోళనలకు దిగారు. కానీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాల మాటనూ బేఖాతరు చేసింది. దాంతో ఉద్యమ వేదిక ఢిల్లీకి మారింది. 2020, నవంబర్ 26న రైతు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి వేలాదిగా…