ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సాగా నడుస్తోందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇచ్చి అఖండ విజయాన్ని అందుకొని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు.. అదే విధంగా ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో సెలబ్రిటీలతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్ కి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన…
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో స్టాప్ అనేదే లేకుండా ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. తాజాగా ఆహా రిలీజ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే త్వరలో ప్రేక్షకులకు బిగ్గెస్ట్ ట్రీట్ ఉండబోతోందని అర్థమవుతోంది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ బిగ్గెస్ట్ టాక్ షోలో పాల్గొనబోతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే… దర్శక దిగ్గజం రాజమౌళి, కీరవాణి. వీరిద్దరూ బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ షోలో ఫన్…
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్…
‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలకృష్ణ ఆహా లో మొదలెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ గా కొనసాగుతోంది.. ఎప్పుడు సీరియస్ గా కానించే బాలయ్య ఈ షో లో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేయడం, వచ్చిన సెలబ్రేటీపై కామెడీ పంచులు విసరడం ఈ షోని ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాలయ్య ఏంటీ ..? హోస్ట్ ఏంటీ అన్నవాళ్ళే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అంటే బాలకృష్ణ ఈ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో అయినా, యాడ్స్ తో పాటు బుల్లితెర షోలు అయినా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకెళ్తున్నారు. వెండితెర ప్రిన్స్ మహేష్ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలలో కనిపించడానికి కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకవైపు బాలయ్యతో “అన్‌స్టాపబుల్” అంటూనే, మరోవైపు ఎన్టీఆర్ తో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా నెక్స్ట్ లెవెల్ ఎంటెర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ డిసెంబర్ 5న జెమినీ టీవీలో…
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి.…
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగానే బాలయ్య ఆహా లో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కొద్దిరోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన చేతికట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. ఇటీవల అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన చేతికట్టుతోనే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన చేయి బాగానే ఉండడంతో అలాగే ‘అన్ స్టాపబుల్’…