నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కు బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు థమన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగినట్లు అనిపిస్తుంది.
ప్రగ్యా బాలకృష్ణను సార్ అని పిలవగానే.. బాలయ్య ‘సార్ ఆ?’ అనటం… వెంటనే ప్రగ్యా ‘బాలా’ అని సంబోధించటం సరదాగా అనిపిస్తుంది. ఇక ఇందులోనే తను ‘విలన్‌గా చేయడానికి రెడీ’ అని బాలయ్య ప్రకటించాడు. అయితే కొంచెం పాస్ తీసుకుని ‘హీరో కూడా నేనే…’ అనేయటం బాగుంది. ప్రోమోలోనే బాలయ్య ఎనర్జీ ఫుల్ గా ఆకట్టుకునేలా సాగింది. ఈ ప్రోమోతో ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి. మరి డిసెంబర్ 10న ఆహా స్ట్రీమింగ్ అయ్యే ఫుల్ ఎపిసోడ్ ఎంతలా అకట్టుకుంటుందో చూద్దాం.