బాలయ్యతో మహేష్… ‘అన్‌స్టాపబుల్’ ఫన్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ్ ను షూట్ చేస్తారని షో సన్నిహిత వర్గాల సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి. మరి వీరిద్దరి మధ్య ఫన్ ఎలా ఉండబోతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణతో మృదుభాషి అయిన మహేష్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అంటే ‘భీమ్లా నాయక్’కి భయం లేదట!
Also Read
- Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
- Tollywood Latest Update : మెగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... రామ్ చరణ్ - సుకుమార్ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం
- Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
- Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా బడ్జెట్ లెక్కలివే!
“అన్‌స్టాపబుల్” షోతో బాలకృష్ణ హోస్ట్‌గానే కాకుండా ఓటిటి అరంగేట్రం కూడా చేశాడు. తెలుగు ఓటిటి ‘ఆహా’లో ఈషో ప్రారంభమైనప్పటి నుండి వరుసగా సెలెబ్రిటీలతో బాలయ్య చేస్తున్న సందడి చర్చనీయాంశం అవుతోంది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, రెండవ ఎపిసోడ్ లో నాని, మూడవ ఎపిసోడ్ లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కన్పించారు. కాగా బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన “అఖండ” చిత్రంతో మాస్ జాతర జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు.
తాజావార్తలు
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
-
Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
-
Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!