ఒకప్పుడు వయసుకి వస్తే చాలు.. మాకు పెళ్లెప్పుడు మొర్రో అని యువత మొత్తుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాకు పెళ్లొద్దు మొర్రో అని కేకలు పెడుతున్నారు. పెళ్లంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అసలు పెళ్లి గురించి మాట్లాడటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన చేయడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదట! చదువు, ఉద్యోగాలు, వృత్తులు వంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతుండటం వల్లే మన దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య గణనీయంగా…