U-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 మహిళల అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్ 19 మహిళల ప్రపంచకప్‌లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ 34 బంతుల్లో 78, శ్వేత 49…
గత కొన్నేళ్లుగా వాహనరంగంలో వివిధ మార్పులు వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఎగిరే కార్లు మాత్రం చాలా కాలంగా కలగానే ఉన్నాయి. ఇప్పడిప్పుడే రియల్ వరల్డ్‌లో కూడా ఈ ఎగిరే కార్లు టెస్టింగ్ పూర్తి చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఆసియా కప్ 2022 ట్రోఫీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహయాన్ శుక్రవారం ఆవిష్కరించారు. ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఆవిష్కరించారని యూఈఏ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి, గల్ఫ్‌లో అత్యంత కీలకమైన యూఏఈ గోధుమల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకొన్న గోధుమలను మరో దేశానికి ఎగుమతి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగు నెలలపాటు నిషేధం విధించింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడోంది. ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్…
క్రికెట్ చరిత్రలో అప్పుడప్పుడు చెత్త రికార్డులు నమోదవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. హేమాహేమీలు ఎన్నోసార్లు తడబడటం, పెద్ద పెద్ద జట్లు కూడా కొన్నిసార్లు పేలవ ప్రదర్శనతో నిరాశపర్చడం లాంటివి క్రికెట్ హిస్టరీలో ఎన్నో సందర్భాలున్నాయి. అయితే, తాజాగా నమోదైన రికార్డ్ మాత్రం అత్యంత చెత్తది. అసలు ఇలాంటి రికార్డ్ నమోదు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ అదేంటి? అని అనుకుంటున్నారా! పదండి, మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం! శనివారం నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్…
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం…
భారతదేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలను విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశకంర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్న సర్టిఫి కేట్లను గుర్తించాలని ఆయన కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారాక్ అల్ -హజరప్‌తో ఆయన సమా వేశం అయ్యారు. వీరిద్దరూ భారత్- జీసీసీ సంబంధాలపై సమీ క్షించి వాణిజ్యం, పెట్టు బడులపై చర్చించారు. నయేఫ్ ఫలాహ్ కువైట్ మాజీ ఆర్థిక మంత్రి. ఆయన…
ప్రముఖ హీరోయిన్ త్రిషకు అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా లభించింది. ఫలితంగా ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డు సాధించింది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు…
టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.. కరోనా నేపథ్యంలో.. యూఏలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇస్తూనే.. మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ ప్రకటిస్తారనే రాజీవ్ శుక్లా వెల్లడించగా… ఇవాళ టోర్నీ నిర్వహణ, వేదికలపై ప్రకటన చేసింది ఐసీసీ.. కోవిడ్ నేపథ్యంలో.. మ్యాచ్‌ల నిర్వహణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలకు మార్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.. అక్టోబర్ 17వ…