UAE: భారత గోధుమలను ఇతర దేశాలకు ఎగుమతి నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ సంక్షోభం నెలకొంది. గోధుమను ఎక్కువగా పండించే రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధంలో ఉండటంతో గోధుమ కొరత ఏర్పడోంది. ప్రపంచంలోనే గొధుమలను ఎక్కువగా పండించే రెండో దేశంగా భారత్ ఉంది. అయితే భారత్ కూడా తన దేశ అవసరాల నిమిత్తం ఇటీవల గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దీనిపై ఈయూ దేశాలు తీవ్ర అభ్యంతరం కూడా తెలిపాయి. భారత దేశంలో ఆహార భద్రత కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే క్రెడిట్ లెటర్స్, ఆహార భద్రత కోసం కొన్ని దేశాలకు మినహా అన్ని దేశాలకు ఇండియా గోధుమలను బ్యాన్ చేసింది.
కాగా ఇండియా నుంచి దిగుమతి అయ్యే గోధుమలను మళ్లీ ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా 4 నెలల పాటు ఎగుమతులపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) బ్యాన్ విధించింది. అంటే ఇండియా నుంచి వచ్చే గోధుమలను మళ్లీ యూఏఈ నుంచి ఏ ఇతర దేశానికి కూడా ఎగుమతి చేయకూడదని అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యూఏఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా దేశీయ అవసరాల కోసం యూఏఈకి గోధుమలు ఎగుమతి చేయడానికి భారత్ అంగీకరించిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
మే 14న భారత దేశంల గోధుమల ఎగుమతులను నిషేధించింది. అయితే క్రెడిట్ లైన్స్, కొన్ని దేశాలకు మాత్రమే గోధుమలను ఎగుమతి చేస్తోంది. అప్పటి నుంచి దాదాపుగా 4,69,202 టన్నుల గోధుమల రవాణా చేయడానికి ఇండియా అనుమతించింది. భారత్ నుంచి యూఏఈకి వచ్చిన గోధుమలను తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని యూఏఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూఏఈ, ఇండియా ఫిబ్రవరిలో విస్తృత వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది ఒక దేశం వస్తువులపై మరో దేశం సుంకాలను తగ్గించుకోవాలని, ఐదు ఏళ్లలో వార్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!