Rahul Gandhi: రాహుల్‌గాంధీని టెర్రరిస్టు అన్న కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్
- రాహుల్‌గాంధీని టెర్రరిస్టు అన్న కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్
- బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన తీవ్ర వివాదాలకు దారి తీసింది. అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. భారత్‌లో సిక్కులు భయంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కేంద్రమంత్రులు కూడా మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Devara -Pushpa 2: ‘దేవర’ ఆయుధ పూజ.. ‘పుష్ప 2’ జాతర.. పోతారు మొత్తం పోతారు!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ ఇటీవల రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంటూ సంభోదించారు. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల్లో ఒకరు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేంద్రమంత్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం కేంద్ర మంత్రిపై కేసు నమోదైంది.
‘‘రాహుల్‌గాంధీ ఇండియన్ కాదు. ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు. ఆయనకు ఈ దేశంపై ఏ మాత్రం ప్రేమ లేదు. అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా మన దేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాటెండ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు-తుపాకులు-బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు. వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్టు ఆయనే అవుతారు’’ అని రవ్‌నీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Thota Trimurthulu: జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?
అమెరికాలో రాహుల్ మాట్లాడుతూ ‘‘సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని సోనియాగాంధీ ఇంటిముందు సిక్కులు ఆందోళనలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Devara: మెంటలెక్కిస్తున్న ‘దేవర’.. ఒక్కోటి ఒక్కో డైమాండ్ మావా!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!