Online Games Banned: ప్రస్తుతం ఆన్‌లైన్ గేమింగ్ యువ తరాన్ని మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా శాసిస్తోంది. ఇది ఒక రకమైన వ్యసనం. ఇది ఇప్పుడు నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయల్ ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఆయనకు తోడుగా మాజీ ఎంపీ డాక్టర్ సోనాల్ మాన్ సింగ్ కూడా నిలుస్తున్నారు. ఈ సందర్బంగా సోనాల్ మన్ సింగ్ మాట్లాడుతూ.. యువతరం మన దేశానికి గర్వకారణమని చెబుతూనే.. యువతే కాకుండా చిన్నారులు, వృద్ధులు, పురుషులు, మహిళలు అందరూ ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొంటున్నారని అన్నారు. ప్రధానంగా దేశాన్ని నిర్మించడంలోనూ, భవిష్యత్తును చూసుకోవడంలోనూ శక్తిసామర్థ్యాలున్న యువకులు ప్రస్తుతం గేమింగ్ యాప్‌ల వల్ల ఎక్కడో తప్పిపోతున్నారని ఆమె అన్నారు. దేశం, సమాజ సంక్షేమం విషయానికి వస్తే.. యువతరం దానిలో ప్రధాన పాత్ర పోషించాలని, కానీ వారు గేమింగ్ యాప్‌ల ద్వారా తమ భవిష్యత్తును అలాగే దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని ఆమె అన్నారు.
ఓ పద్ధతి ద్వారా ఈ వ్యసనాన్ని వదిలించుకోవడానికి దేశవ్యాప్తంగా మత పెద్దలు, మహాత్ములు, దేవగురువులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని సోనాల్ మాన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా, గేమింగ్ యాప్‌ల లోటుపాట్లపై పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలతో చర్చ జరగాలని.. సోషల్ మీడియా ద్వారా కూడా దీని వ్యసనం, చెడు అలవాట్లను దూరం చేసేందుకు ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టవచ్చని ఆమె తెలిపారు. డ్యాన్స్, కల్చర్ ద్వారా కూడా ఆ రంగంలో మెరుగులు దిద్దవచ్చని సోనాల్ మాన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తన నృత్యం ద్వారా ఆమె అనేక సామాజిక దురాచారాలు, మహిళా హింస, గృహ హింస సమస్యలపై అవగాహన పెంచింది. ఆన్‌లైన్ గేమింగ్‌ను అంతం చేయడానికి ప్రస్తుతం సాంస్కృతిక కళాకారులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త సేవలు ప్రారంభం.. డేటాతో పనిలేకుండా ఐఎఫ్‌టీవీ ప్రసారాలు
#onlinegaming जुआ आज समाज में तेजी से फ़ैल रहा हैं जिससे लाखों लोगों के घर परिवार बर्बाद हो रहे हैं बच्चे और युवा इसका शिकार बन रहे हैं।
आइये शनिवार 16 नवम्बर प्रातः 10 बजे जंतर मंतर पर धरने में और इस अभियान से जुड़कर #OnlineGaming रूपी इस वायरस को मिलकर खत्म करें। #Gaming pic.twitter.com/OUh1GwV7Oh
— Vijay Goel (@VijayGoelBJP) November 13, 2024