అనకాపల్లి తాళ్లపాలెంలోని రేషన్ డిపో లో ఆకస్మికంగా తనిఖీలు చేసారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద ఉచిత బియ్యం, నిత్యావసర సరుకులు సరఫరా పై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యం, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్న ఆర్థిక మంత్రి… కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యన్ని కేంద్రం పేరుతోనే ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం…
కేంద్రమంత్రులు పశుపతి పరాస్ పాశ్వాన్, కిషన్ రెడ్డిని ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి పశుపతి పరాస్ పాశ్వాన్ ను కలిశాను. రాష్ట్ర విభజన తరువాత ఏపీ 74 శాతం వ్యవసాయం పై ఆధారపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి ఉన్న పథకాలను యధావిధిగా కొనసాగించాలని కోరాం. వ్యవసాయం ,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకుముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించాం. పోలవరం…
తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు, జాతీయ రహదారుల గుర్తింపు చేయాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్య సభ ఎంపీల బృందం. అందులో… విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మించాలి. తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను గుర్తించాలని విన్నవించిన ఎంపీల బృందం… చౌటుప్పల్-షాద్ నగర్-కంది (RRR) – 186 KM…
పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడవద్దు. “కోవిడ్” ప్రవర్తనా నియమాలను పాటించాలి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాస్కు ధరించి , భౌతిక దూరం పాటించాలి. కేవలం అధికార యంత్రాంగమే కాదు, ప్రజల భాగస్వామ్యంతోనే “కరోనా”ను జయించవచ్చు. ఇక స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ చారిత్రక సంపదను డిజిటలైజేషన్ చేస్తున్నాం అని తెలిపారు. 18 కోట్ల డాక్యుమెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పురాతన, చారిత్రక సంపద ను…
కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. యూరోప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్, వాక్సిన్ లు, మందులు అందుబాటులోకి తీసుకువచ్చింది సర్కారు. తెలంగాణకు 1400 వెంటిలేటర్ లు 46 ఆసుపత్రులకు ఇచ్చాము. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేటర్ వినియోగిస్తే గత రెండు ఏళ్లలో 50 వెలకు పైగా…
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…
వ్యాక్సినేషన్ పంపిణి పై హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ పై కొందరు కేసీఆర్ కుటుంబ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చిని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉంది. విదేశాంగ మంత్రి వ్యాక్సిన్ ముడి సరుకు కోసం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారు. దేశంలోని హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక్కటే వ్యాక్సిన్…
తెలంగాణకి 71 లక్షల 23 వేల 50 వ్యాక్సిన్ డోస్‌లు వచ్చాయి అని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ 65,86,650 డోస్‌లు.. 27 ప్రైవేట్ హాస్పిటల్స్ కి 5,36 ,600 డోస్‌లు చేరాయి. రేమిడిసివిర్ తెలంగాణకి 3 లక్షలు.. ఆంధ్ర కు 6 లక్షలు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది. ఇతర దేశాల నుండి వ్యాక్సిన్ ప్రోక్యూర్ పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయి. కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుంది అని అంటున్నాయి.. కేంద్రం…
రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ ఇస్తాం అని తెలిపారు. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలి. కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుంది. కరోనాతో చనిపోతున్న…