తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు, జాతీయ రహదారుల గుర్తింపు చేయాలని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరికి వినతి పత్రం అందించారు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్య సభ ఎంపీల బృందం. అందులో… విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, నిర్మించాలి.
తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను గుర్తించాలని విన్నవించిన ఎంపీల బృందం… చౌటుప్పల్-షాద్ నగర్-కంది (RRR) – 186 KM నేషనల్ హైవే గా గుర్తించాలి. కరీంనగర్-సిరిసిల్లా-కామారెడ్డి-యల్లారెడ్డి-పిట్లం – 165 KM నేషనల్ హైవే గా గుర్తించాలి. కొత్తకోట-గూడూరు నుండి మంత్రాలయం – 70 KM వరకు నేషనల్ హైవే గా గుర్తించాలి. జహీరాబాద్-బీదర్-డెగ్లూర్ వరకు 25 KM నేషనల్ హైవే గా గుర్తించాలి అని తెలిపారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి 2021 సంవత్సరానికి రావాల్సిన సెంట్రల్ రోడ్డు ఫండ్స్ (సీఆర్ఎఫ్) రూ. 620 కోట్లను విడుదల చేయాలి. మిర్యాలగూడ లో ఇప్పటికే వున్నా డబుల్ రోడ్ ను నాలుగు లైన్ల రహదారిగా మార్చాలి అని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు.