Union Minister Rammohan Naidu: భారత దేశంలో ప్రతీ 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది.. ప్రతీ గంటకు 60 అదనపు విమానాలు భారత్‌లో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరుగుతోన్న ఏవియేషన్ సదస్సులో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాది రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 88 కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేశారని తిలిపారు.. ప్రతి 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది.. ప్రతి గంటకు 60 అదనపు విమానాలు భారత్‌లో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.. UDAN ప్రాజెక్ట్ విస్తరణతో పాటు హెలిపోర్ట్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.. ప్రైవేట్ రంగంతో కూడిన కేంద్ర రాష్ట్ర సమన్వయంతో వైమానిక రంగ అభివృద్ధి జరుగుతోందన్నారు.. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..