శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు.
విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ అయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కలిపిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుతున్నాయని మండిపడ్డారు.
విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్‌పోర్టు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మూలపేట పోర్టు పూర్తి చేసి సంవత్సర కాలంలో షిప్ వచ్చేలా చేస్తామన్నారు.
తిరుపతి జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు. గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.. వాటిని చాలా సీరియస్‌గా తీసుకున్నాంమని తెలిపారు. బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి.. కానీ అవన్నీ ఫేక్ అని తెలుతున్నాయని అన్నారు.
విజయవాడలోని కృష్ణా తీరంలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో భాగంగా పున్నమి ఘాట్‌లో అతిపెద్ద డ్రోన్ షోను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కృష్ణా నది తీరంలో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షోను ఏర్పాటు చేశారు.
నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. జాతీయ రహదారులపై కేంద్ర మంత్రిత్వ సమీక్ష జరిపాం అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులకు ఉన్న భూ సేకరణ సహా అడ్డంకులపై చర్చించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, రహదారులకు ఉన్న అడ్డంకులు, సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నాం అని వివరించారు.. అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ CRF కింద మరింత అదనపు నిధులు ఇస్తామన్నారని వెల్లడించారు..
నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ పర్యటించనున్నారు. గురుపూజోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 5 గురువారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్లీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఈ వారంలో ఆంధ్రప్రదేశ్‌కు మరో తడి వాతావరణం ఎదురుకావచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. “ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర లో నేటి నుంచి 8వ తేదీ వరకు, దక్షిణ కోస్తా లో ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వానలు ఏకధాటిగా…
శ్రీకాకుళం జిల్లాలో పీఆర్‌టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీలకు కొన్ని కొన్ని శాఖలు కేటాయించారని.. కేటాయించిన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. వివిధ స్కీంల వచ్చే కింద కేంద్ర నిధులను ఏపీకి రప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.