రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇన్‌ఛార్జిగా బీజేపీ శనివారం నియమించింది. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షతో విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజస్థాన్‌లోని కోట శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి వెంట ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా ఉన్నారు. ఈ భేటీలో కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది. గతవారం సీఎం పర్యటనతో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పెట్రోలియం…