హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. టూర్‌లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మర్యాద పూర్వకంగానే ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది.
క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కొత్త చూస్తున్నామని కొందరు ముస్లిం నేతలు ప్రసంశలు కురిపించారు. ముస్లిం మత పెద్దల ప్రతినిధి బృందం నిన్న అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంది. శ్రీరామనవమి తర్వాత మతపరమైన హింస, ద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయోగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని రక్షించడంలో CISF సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో 54 వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు.
తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్…
జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులకు పలు సూచనలు చేసారు అమిత్ షా. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాలు వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రులు స్వయంగా పర్యవేక్షించాలి అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో కేంద్రం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు కూడా తమ సూచనలు, సలహాలు ఇవ్వాలి. డ్రగ్స్ రవాణా, వాడకాన్ని అరికట్టడానికి ముఖ్యమంత్రులు చొరవ చూపాలి. దేశంలో ఒక ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీల ఏర్పాటు చేసారు. రాష్ట్రాలు కూడా…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…