దేశాన్ని రక్షించడంలో CISF సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు.
హైదరాబాద్‌లో 54వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా..CISF పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Also Read:Vande Bharat Express: ఎద్దును ఢీకొట్టిన వందే భారత్.. రైలుకు మళ్లీ డ్యామేజ్!
కాగా, కేంద్ర హోమంత్రి అమిత్ షా నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీకి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ వ్యూహాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పార్టీ నేతలతో అమిత్ షా మరోసారి సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. కాగా,హైదరాబాద్ పర్యటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో కేరళలోని కోచికి వెళతారు.