కోల్‌కతా హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యార్థులు, నర్సులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. బాధితురాలి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి ప్రార్థిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్‌లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడారు.
Covid vaccine: ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు…
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
కొవిడ్ తర్వాత యువకుల్లో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు పార్లమెంటుకు తెలిపారు.
Mansukh Mandaviya: కరోనా ఒక వైరస్, ఇది పరివర్తన చెందుతూనే ఉంటుందని, భారతదేశంలో ఇప్పటి వరకు 214 విభిన్న రకాలను కనుగొన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఇటీవల కరోనా కేసుల్లో పెరుగుదల ఉందని, ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా ఇతర ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, వారానికోసారి సమీక్ష జరుగుతోందని ఆయన అన్నారు. కోవిడ్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం అసాధ్యం అని, ప్రస్తుతం వస్తున్న వేరియంట్లు…
కరీంనగర్ పెద్దాసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చండి. జిల్లా ఆసుపత్రికి ఎమ్మారై, హుజూరాబాద్ కు సీటీ స్కాన్ ను ఇవ్వండి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ కు ఎంపీ బండి సంజయ్ విన్నవించారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, పేద రోగుల ప్రయోజనార్ కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్, హుజూరాబాద్ ఆసుపత్రికి సీటీ స్కాన్ ను తక్షణమే మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గురువారం…