ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది.
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్-ల్యాండింగ్ చేయడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మిషన్ యొక్క విజయం కేవలం ఇస్రోది మాత్రమే కాదని.. ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పురోగతి చిహ్నంగా పేర్కొంది.
నేడు ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
Cabinet Meet: ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ జరిగితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన వారితో పాటు మరికొందరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకనున్నారు.
పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఇక్కడ తెలిపారు.
దేశవ్యాప్తంగా గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములు ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.లక్ష కోట్లతో గిడ్డంగుల కోసం కొత్త పథకాన్ని రూపొందించనుండగా.. 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే లక్ష్యంతో ఈ పథకం ఉండనుంది.
Centre revises One Rank One Pension scheme: పదవీ విరమణ చేసిన మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) స్కీమ్ ను కేంద్ర మంత్రి వర్గం సవరించింది. దీంతో 25 లక్షల మంది మాజీ సైనికులకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 25.13 లక్షల మంది మాజీలకు లబ్ధి చేకూరనుంది. సవరించిన విధానంతో సాయుధ…
రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్‌డ్ బోనస్‌ను (పీఎల్‌బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది… ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో.. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం లభించింది.. ఈ సంస్కరణ రవాణా రంగానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరిస్తుంది, చివరి-మైల్ డెలివరీని వేగవంతం చేస్తుంది మరియు వ్యాపారాలకు డబ్బు ఆదా చేస్తుందని.. ఈ నెల 17న ప్రధానమంత్రి మోడీ.. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ విధానం లాజిస్టిక్స్ సేవల్లో ఎక్కువ సామర్థ్యం కోసం…
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.