Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు.
Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక నేతల వరకూ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Sonia Gandhi: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది.
Union Budget 2025: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
Budget 2025 : ద్రవ్యోల్బణ నియంత్రణ, పన్ను సంస్కరణలు, ఉపాధి కల్పనపై 2025 కేంద్ర బడ్జెట్ ప్రధాన దృష్టి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు,
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండియాని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లే అనేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిర్మలమ్మ చేయబోయే బడ్జెట్ ప్రసంగం గురించి అంతా ఎదురుచూస్తు్న్నారు. శనివారం, ఆమె వరసగా 8వ సారి కేంద్ర బడ్జెన్‌ని ప్రవేశపెట్టబోతున్నారు.
Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులు, పథకాలపై ఖర్చు వివరాలను ఇస్తుంది.
Union Budget 2025: 2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుగా ఉండనున్నది. ఇక, రూ. 15 లక్షల నుంచి రూ.…