Union Budget 2025: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
- నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
- నేడు పార్లమెంట్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం..
- ప్రభుత్వ లక్ష్యాలు, సాధించిన ఫలితాలను వివరించనున్న రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పించనున్నారు. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈరోజు (జనవరి 31) నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ జరగనుండగా.. సెకండ్ విడత మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. కాగా, నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటం ఇది వరుసగా 8వ సారి కావడం విశేషం.
Read Also: Uttam Kumar Reddy : త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్‌వి అనవసర విమర్శలు
Also Read
అయితే, బడ్జెట్ సమావేశాల్లో పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. వక్ఫ్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుల లాంటివి ఇందులో లిస్ట్ చేశారు. వక్ఫ్ బిల్లుపై నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు గురువారం నాడు పార్లమెంటరీ కమిటీ ఇవ్వగా.. అది ఈ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో ‘ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆయిల్ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. గత సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న మరో 10 బిల్లులూ ఈసారి సభలోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!