2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సిద్ధీకరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసితారామన్ (Nirmala Sitharaman) కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సంవత్సరం ప్రవేశ పెట్టనున్న యూనియన్ బడ్జెట్ కోసం ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లతో బడ్జెట్ పన్ను మినహాయింపు దక్కుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రకటనలు వెలువడుతాయని భావిస్తున్నారు.
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది.
Railway Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశం దృష్టి దీనిపైనే ఉంది.
పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
Income Tax: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికి రూ. 15 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులపై ‘‘ఆదాయపు పన్ను’’ తగ్గించాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.